ఒమిక్రాన్‌ పట్ల ప్రజలు ఆందోళ చెందొద్దు : మంత్రి హరీష్‌ రావు

Harish Rao : తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడడం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు స్పందించారు.

Update: 2021-12-15 09:56 GMT

Harish Rao : తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడడం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు స్పందించారు.కొత్త వేరియంట్‌ పట్ల ఆందోళన వద్దని, కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారి కాంట్రాక్ట్‌లు ట్రేస్‌ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచుతున్నట్లు ప్పష్టం చేశారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, రాష్ట్రంలోని 25వేలకు పైగా ఉన్న పడకలను ఆక్సిజన్‌ సౌకర్యం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బూస్టర్‌ డోస్‌ కోసం కేంద్రాన్ని కోరామన్నారు.

Tags:    

Similar News