Harish Rao : వ్యాట్ అంశంలో ఛాలెంజ్ చేస్తే .. బీజేపీ నేతలు ఎవ్వరూ స్పందించలేదు..!
Harish Rao : కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు.;
Harish Rao : కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. అబద్ధాలు చెప్పడంలో రాష్ట్ర బిజెపి నాయకులతో కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారన్నారు. అక్కడ వడ్లు కొనమని చెప్పేది వాళ్లే- ఇక్కడ వడ్లు వేయాలని చెప్పేది వాళ్లనేని మండిపడ్డారు. వ్యాట్ అంశంలో చాలెంజ్ చేస్తే.. బిజెపి నేతలు ఎవ్వరూ స్పందించలేదని ఎద్దేవ చేశారు. ఎయిమ్స్ పై వ్యాఖ్యల విషయంలో కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్దాలను గ్లోబల్స్ ప్రచారం చేస్తానంటే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.