కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం...!
కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే అక్కసుతోనే రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.;
కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే అక్కసుతోనే రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. డీపీఆర్ సమర్పించడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా వాణిదేవి తరపున మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.. కాజీపేట రైల్వే కోచ్ ఏర్పాటుకు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. చివరికి బడ్జెట్‌లో సైతం రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని హరీష్‌రావు ఆరోపించారు.