యువకులతో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి హరీష్ రావు..!
ఆన్‌లైన్ ఆటల్లో పడి నిజమైన ఆటలకు పిల్లలు దూరమయ్యారని అందుకే వారిలో శారీరక దృఢత్వం తగ్గిపోయిందన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు.;
ఆన్‌లైన్ ఆటల్లో పడి నిజమైన ఆటలకు పిల్లలు దూరమయ్యారని అందుకే వారిలో శారీరక దృఢత్వం తగ్గిపోయిందన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో పర్యటించిన ఆయన... ముప్పిరెడ్డిపల్లిలో సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. యువకులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. గతంలో ఏ గ్రామంలో చూసినా... యువకులు వాలీబాల్, క్రికెట్ ఆటలు ఆడేవారని... ఇప్పుడు ఆన్‌లైన్ గేమ్‌లకే పరిమితమయ్యారన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యవంతంగా, మానసిక ఉల్లాసంతో ఉండాలంటే క్రీడలకు ప్రోత్సాహించాలని పిలుపునిచ్చారు.