మరోసారి పెద్దమనసును చాటుకున్న మంత్రి హరీష్‌రావు
మంత్రి హరీష్‌రావు మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు. బైక్‌పై వెళ్తున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి కిందపడిపోవడంతో ..;
మంత్రి హరీష్‌రావు మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు. బైక్‌పై వెళ్తున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి కిందపడిపోవడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. మాసాయిపేట వద్ద జాతీయ రహదారి పై ఈ ఘటన జరిగింది. ఐతే అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి.. వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్నారు. కారు దిగి యువకుల వద్దకు వెళ్లి.. సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వారికి తగిలిన గాయాల గురించి తెలుసుకున్నారు. వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్పించి.. మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్థానిక పోలీస్ అధికారులను ఆదేశించారు. మరోసారి మంత్రి పెద్దమనసు చాటుకోవడంపై.. అభినందలు వెళ్లువెత్తుతున్నాయి.