Harish Rao : వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష..!
Harish Rao : తెలంగాణలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్ పూర్తయిందని.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.;
Harish Rao : తెలంగాణలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్ పూర్తయిందని.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త మెడికల్ కాలేజీలుతో పాటు పలు అంశాలపై చర్చించారు. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్...38.5 శాతం మందికి రెండో డోస్ వేశారని చెప్పారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో మొదటిడోస్ 79శాతంగా, రెండో డోస్ 37.5 శాతంగా నమోదైందని వెల్లడించారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు.