Munugodu: మునుగోడు ప్రజానీకానికి.. హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి హరీష్
Munugodu: మునుగోడు బైపోల్ సందర్భంగా ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామన్నారు మంత్రి హరీష్.;
Minister Harish Rao: మునుగోడు బైపోల్ సందర్భంగా ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామన్నారు మంత్రి హరీష్. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు.... చౌటుప్పల్‌లో ఐదు పడకల డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
డయాలసిస్ కేంద్రాల పనితీరులో దేశంలో మార్గదర్శకంగా నిలబడ్డామన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తెలంగాణ ప్రభుత్వ వైద్య సేవలను ఆదర్శంగా తీసుకుని…. తమిళనాడులో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. మునుగోడు నియోజకవర్గంలో క్యాన్సర్ ఫేషంట్ల కోసం పాలియోటివ్ కేంద్రం, వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించబోతున్నామన్నారు మంత్రి హరీష్.