మోదీ ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు విమర్శలు..!
కేంద్రం పెట్రోల్, డీజీల్ గ్యాస్, ఎరువుల ధరలను పెంచుతూ ప్రజలకు వాతలు పెడుతోందని హరీష్‌రావు ఆరోపించారు.;
మోదీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. కేంద్రం పెట్రోల్, డీజీల్ గ్యాస్, ఎరువుల ధరలను పెంచుతూ ప్రజలకు వాతలు పెడుతోందని హరీష్‌రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి.. దివ్యాంగులకు ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేశారు. దివ్యాంగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని చెప్పారు. దివ్యాంగులు తమ సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.