'బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ' : మంత్రి హరీష్ రావు
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. భారతీయ జూటా పార్టీ అన్నారు మంత్రి హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి..;
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. భారతీయ జూటా పార్టీ అన్నారు మంత్రి హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అభ్యర్ధి సుజాతతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు.. విపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. బీజేపీ - కాంగ్రెస్‌లవి మాఫింగ్, ఫేకింగ్ సోషల్ ప్రాచారాలు అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు.. బీజేపీ అంటే బాయికాడ మోటర్లని.. టిఆర్‌ఎస్ అంటే కడుపు నింపి చూసుకునే పార్టీ అన్నారు. 60,70 ఏళ్లలో మారని గ్రామాల స్వరూపాన్ని ఆరేళ్లలో చేసి చూపెట్టిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిది అన్నారు.