కిషన్ రెడ్డిది ప్రజలను మోసం చేసే యాత్ర : మంత్రి జగదీష్ రెడ్డి
కిషన్ రెడ్డిది ప్రజా ఆశీర్వాద యాత్ర కాదు... ప్రజలను మోసం చేసే యాత్రని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.;
కిషన్ రెడ్డిది ప్రజా ఆశీర్వాద యాత్ర కాదు... ప్రజలను మోసం చేసే యాత్రని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. యాత్రపేరుతో కిషన్ రెడ్డి వాస్తవాలు చెప్పకుండా గాలి మాటలు చెప్పుతున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. 70 రూపాయలుగా ఉన్న పెట్రోల్, డీజిల్‌ను వంద దాటించినందుకు ఆశీర్వదించాలనా అంటూ సెటైర్లు వేశారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చలేదన్నారు. నల్లధనం తెస్తామన్న బీజేపీ మాటల విన్న ప్రజలు.. తెల్లడబ్బును కూడా పోగొట్టుకున్నారు. 2వేల రూపాయల ఫించన్‌ను.. కనీసం మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఇక టీఆర్‌ఎస్ పథకాలు కాపీ కొడుతున్నారని.. వాటిని కూడా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పూర్తిగా అమలు చేయడం లేదని మండిపడ్డారు.