కాంగ్రెస్ నేతల అబద్ధాల ప్రచారాన్ని సాగర్ ప్రజలు నమ్మలేదు : జగదీష్‌రెడ్డి
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.;
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే నాగార్జునసాగర్‌లో నోముల భగత్‌ను గెలిపించాయని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా సాగర్ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు.
భగత్ తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 18 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీనితో టీఆర్ఎస్ తిరిగి తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముందునుంచే ప్రత్యర్ధుల పైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన భగత్.. భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. అటు బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. భగత్ విజయంతో పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయనకీ అభినందనలు తెలుపుతున్నారు.