జనవరి నుంచి దేశంలో టూరిజాన్ని పరుగులు పెట్టిస్తాం: కిషన్ రెడ్డి
Kishan Reddy: వచ్చే జనవరి నుంచి దేశంలో టూరిజాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి.;
వచ్చే జనవరి నుంచి దేశంలో టూరిజాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికే టూరిజానికి సంబంధించిన అనేక విభాగాలతో సమావేశాలు నిర్వహించామని, భారత్‌లో టూరిజం అంతగా అభివృద్ధి కాకపోవడానికి గల కారణాలను అన్వేషించామని చెప్పుకొచ్చారు. విదేశీ, స్వదేశీ పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. మొన్నటి వరకూ హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న తనకు.. ఐదుగురు సహాయమంత్రులను సహాయకులుగా ఇచ్చారని అన్నారు.