Kishan Reddy: జైల్లో ఉన్న బండి సంజయ్‌తో కిషన్‌రెడ్డి ములాఖత్
Kishan Reddy: సంజయ్ పై పాత కేసులను, ఐపీసీ సెక్షన్ 333 కింద కేసు నమోదును బీజేపీ నేతలు తప్పుపట్టారు.;
Kishan Reddy: తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు, రిమాండ్ తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీ స్టేట్ చీఫ్ పట్ల పోలీసుల తీరును బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ...కరీంనగర్‌లో ఆదివారం తలపెట్టిన జాగరణ దీక్షభగ్నంలో..పోలీసులు అత్యత్సాహం ప్రదర్శించారని అగ్రనేతలు మండిపడ్డారు. సంజయ్ పై పాత కేసులను, ఐపీసీ సెక్షన్ 333 కింద కేసు నమోదును బీజేపీ నేతలు తప్పుపట్టారు.
ఎంపీ బండిసంజయ్ అరెస్టు, రిమాండ్ వ్యవహారం నేపథ్యంలో... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటలతోకలిసి కరీంనగర్ బయలుదేరారు. కరీంనగర్ వెళ్లి.. జైల్లో ఉన్న బండి సంజయ్‌తో కిషన్‌రెడ్డి ములాఖత్ కానున్నారు. బండిసంజయ్‌ని పరామర్శించిన అనంతరం... నేరుగా క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. క్యాంప్ ఆఫీస్‌లో ఘటన వివరాలను స్థానిక నేతల నుంచి తెలుసుకోనున్న కిషన్‌రెడ్డి... పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆరా తీయనున్నారు. అనంతరం అరెస్టు చేసిన నేతల కుటుంబసభ్యులతోపాటు, బండిసంజయ్ కుటుంబ సభ్యులను కిషన్‌రెడ్డి పరామర్శించనున్నారు.