గుడ్ మార్నింగ్ నల్గొండ అంటూ పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రామాలయం వద్ద రోడ్డు పక్కన మహిళ సువర్ణ నిర్వహిస్తున్న టిఫిన్ బండీ దగ్గర ఆగి ఇడ్లీ, దోశ తిన్నారు. సువర్ణ పరిస్థితిని చూసిన మంత్రి ఆమెకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు తనకున్న కొద్దిపాటి భూమిని అధికారులు కిరికిరి పెడుతున్నారని మంత్రి దృష్టికి సువర్ణ తీసుకురాగా వెంటనే ఎమ్మార్వోను వచ్చి ఆ భూమి సమస్యను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. అంతకు ముందు ఎన్.జీ.కాలేజీ కంపౌండ్ వాల్ పక్కన స్థానికులు చెత్త వేయడం వల్ల డ్రైనేజీ మొత్తం నిండిపోయి పరిసరాలు చెత్తగా ఉండటంపై మంత్రి సీరియస్ అయ్యారు. డ్రైనేజీపై వాల్స్ నిర్మించి.. చెత్త నిండకుండా చూడాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత లెప్రసీ కాలనీలో డ్రైనేజీ క్లీన్ చేసే సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లో కొత్త మిషనరీ ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. మార్నింగ్ వాక్ లో అందరినీ పలకరిస్తూ సందడి చేశారు.