Minister Komatireddy : విదేశాల నుంచి ప్రభాకర్ రావు రాగానే కేసీఆర్ కుటుంబం జైలుకే

Update: 2025-03-25 11:45 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు విదేశాల నుండి రాగానే కెసిఆర్ కుటుంబం జైలుపాలు కాక తప్పదని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఆయన నల్లగొండ మండలం ఆర్జాలబావి, తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొంతమంది మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ పగటి కలలు కంటున్నాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అలా జరగకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ కు సవాల్ విసిరారు.

రోజు రోజుకి ప్రజల నుండి దూరమవుతున్నామన్న ఆక్రోషంతో బీఆర్ఎస్ నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. ఆరు హామీల అమలులో భాగంగా ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News