ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకి గాయాలపాలైన బాలుడు.. ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా
హైదరాబాద్ మౌలాలి ఈస్ట్ మారుతినగర్‌లో నిశాంత్ అనే బాలుడు ఆడుకుంటున్న సమయంలో.. ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకాడు.;
ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకి తీవ్ర గాయాలపాలైన బాలుడిని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్ మౌలాలి ఈస్ట్ మారుతినగర్‌లో నిశాంత్ అనే బాలుడు ఆడుకుంటున్న సమయంలో.. ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకాడు. దీంతో షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు బాలుణ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడికి చికిత్స అందిస్తున్నారు.
తన బిడ్డను కాపాడాలంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. కన్న బిడ్డ కోసం ఆ తల్లి పడుతున్న ఆవేదనను చూసి చలించిపోయిన మంత్రి కేటీఆర్.. హుటాహుటిన స్పందించారు.. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.