KTR vs Bandi sanjay : దానికి సిద్దమా?.. బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్..!
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కేంద్రానికి రెండు లక్షల 72 వేల కోట్ల పన్నులు చెల్లిస్తే... తిరిగి వాళ్లు రాష్ట్రానికి ఇచ్చింది.;
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కేంద్రానికి రెండు లక్షల 72 వేల కోట్ల పన్నులు చెల్లిస్తే... తిరిగి వాళ్లు రాష్ట్రానికి ఇచ్చింది కేవలం లక్షా 42 వేల కోట్లేనన్నారు. ఇది నిజం కాదని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని... లేదంటే బండి సంజయ్ ఎంపీ పదవికీ రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. అంతకముందు... మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బహిరంగ సభలో బీజేపీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండపడ్డారు మంత్రి కేటీఆర్. మరి మంత్రి కేటీఆర్ విసిరిన ఈ సవాల్‌కు బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.