KTR On IT Industry :ఏడేళ్లలో కాలంలో ఐటీ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం..!

KTR On IT Industry : అవకాశాలు అందిపుచ్చుకోకపోతే వెనుకబడిపోతామని.. మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Update: 2021-09-27 12:00 GMT

KTR On IT Industry : అవకాశాలు అందిపుచ్చుకోకపోతే వెనుకబడిపోతామని.. మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఐటీ, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. సామాన్యుడికి ఉపయోగపడని టెక్నాలజీ నిష్ఫలమన్నారు. ఏడేళ్ల కాలంలో ఐటీరంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పించామని తెలిపారు. మూడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇక ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి కేటీఆర్‌ పేర్కొన్నారు. టీఎస్ ఐ పాస్ ద్వారా భారీగా పెట్టుబడుల్ని ఆకర్షించామని.. మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన, విజన్‌ గొప్పదన్న ఆయన.. కేంద్రం ఇప్పుడు తెచ్చిన సింగిల్‌ విండో విధానానం తెలంగాణలో ఐదేళ్ల క్రితమే తెచ్చామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 17వేల 302 కంపెనీలను ఐ పాస్ ద్వారా ఆకర్శించామని కేటీఆర్‌ అన్నారు. 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకున్నామని.. దానికనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 

Tags:    

Similar News