కాంగ్రెస్‌కు చరిత్ర ఉంది కానీ భవిష్యత్తు లేదు : కేటీఆర్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్ లో సమావేశమైన చర్చించారు.;
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్ లో సమావేశమైన చర్చించారు. ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారన్నారు. హైదరాబాద్‌లో కార్పొరేటర్లు గా పోటీ చేసేందుకు నాయకులు లేని పరిస్థితిని నుంచి రెండుసార్లు జీహెచ్‌ఎంసీలో అతి పెద్ద విజయాలు సాధించారన్నారు. మేయర్ పీఠం సైతం దక్కించుకునే స్థాయికి పార్టీ చేరుకుందన్నారు. ఏ పార్టీకైనా ప్రతి ఎన్నిక అత్యంత కీలకమైనదని అందరూ గుర్తించుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా ముందుకు నడిచి విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు సూచించారు కేటీఆర్.
పార్టీ అభ్యర్థి సురభి వాణి దేవిఅభ్యర్థిత్వాన్ని మన ప్రత్యర్థులు సైతం అభినందించేంత సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు కేటీఆర్. ఆమెకున్న అత్యంత క్లీన్ ఇమేజ్ కచ్చితంగా గ్రాడ్యుయేట్లకు నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి పార్టీ అభ్యర్థికి సానుకూల స్పందన లభిస్తోందని, పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి వాణి దేవిని గెలిపించుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అసత్య ప్రచారాలు చేయడమే తన పనిగా పెట్టుందన్నారు కేటీఆర్.
మిషన్ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా ఇంటింటికీ నల్లనీరు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. కానీ ఇది వారి ఘనతగా బీజెపి చెప్పుకుంటోందన్నారు కేటీఆర్. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఆసత్యాలను ప్రచారం చేస్తోందన్నారు. బీజేపి అసత్యాల ప్రచారాలకు గురికాకుండా మనం చేసిన పనులను జనంలో బలంగా చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు చరిత్ర ఉంది కానీ భవిష్యత్తు లేదన్నారు.
ఈ రెండు పార్టీలు మన పార్టీ అభ్యర్థిని ప్రశ్నించే పరిస్థితుల్లో లేవన్నారు కేటీఆర్. బీజేపి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి గత ఆరేళ్లలో గ్రాడ్యుయేట్లకు, తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. న్యాయవాదిగా ఉన్న రామచంద్ర రావు అసత్యాలే మాట్లాడుతున్నారన్నారు కేటీఆర్. బీజేపికి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు.