Minister KTR : అటవి భూములను ఆక్రమించకుండా చర్యలు తీసుకుంటాం.. !

Minister KTR : అటవి భూములను ఆక్రమించకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్‌. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కలెక్టరేట్‌లో పోడు భూములపై సమావేశాన్ని నిర్వహించారు.

Update: 2021-11-06 12:00 GMT

Minister KTR : అటవి భూములను ఆక్రమించకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్‌. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కలెక్టరేట్‌లో పోడు భూములపై సమావేశాన్ని నిర్వహించారు. అటవి భూముల వ్యవహరంలో అధికారులు ఎవరికి తలొగ్గొదని సూచించారు. తప్పులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజనులకు పోడు భూముల విషయంలో భద్రత కల్పిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని కేటీఆర్‌ అన్నారు. జిల్లాలో 4 లక్షల 72 వేల 329 ఎకరాల భూమి ఉందన్నారు. 8 వేల ఎకరాల్లో ఫారెస్ట్ ఏరియాను ఆక్రమించుకున్నారని ఆయన స్పష్టం చేశారు.67 గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నవంబర్‌ 8 నుంచి గ్రామాల వారిగా సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తు పెట్టుకున్న పోడురైతుల ఆర్జీలను పరిశీలిస్తామని.. భవిష్యత్‌లో సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News