మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం ...!

వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహించే వార్షిక సదస్సుకు రావాలంటూ ఆహ్వానం అందింది.

Update: 2021-09-19 15:00 GMT

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహించే వార్షిక సదస్సుకు రావాలంటూ ఆహ్వానం అందింది. కోవిడ్‌ నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ.. కేటీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ చూపిన విజన్‌కు గుర్తింపుగా ఆయన్ను ఆహ్వానించినట్లు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం తెలిపింది. తెలంగాణను సాంకేతిక రంగంలో రారాజుగా కేటీఆర్‌ నిలిపారని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు బోర్గ్‌ బ్రెండె ప్రశంసించారు. ఈ సదస్సుకు తనను ఆహ్వానించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఐటీ, పరిశ్రమలు, ఆవిష్కరణ రంగాల్లో కనబరుస్తోన్న ప్రతిభకు దక్కిన గౌరవంగా భావిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రపంచ వేదిక వద్ద పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒక అవకాశంగా మలుచుకుంటామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News