వేములవాడ : దసరా లోపు 14 వేల కుటుంబాలకు నల్లా నీరు అందిస్తాం : కేటీఆర్
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధులను అరికట్టొచ్చు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.;
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధులను అరికట్టొచ్చు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా కూలిపోయిన ఇండ్లు, కంకర కుప్పలను తొలగించాలన్నారు. వేములవాడ పట్టణం దక్షిణ కాశీగా పేరు గాంచింది. రాజన్న ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని.. ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. రహదారుల విస్తరణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకంపై దృష్టి సారిస్తామన్నారు. వేములవాడ పట్టణంలో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మిషన్ భగీరథ లైన్ 60 శాతం పూర్తి అయిందని ప.. దసరా లోపు వేములవాడ పట్టణంలో ఉన్న 14 వేల కుటుంబాలకు నల్లా నీరు అందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.