ట్విట్టర్‌లో వ్యాక్సిన్ ధరలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

వన్ నేషన్, వన్ ట్యాక్స్ కోసం అంగీకరించామని.. ఇప్పుడు వన్ నేషన్, వన్ వ్యాక్సిన్ల ధరల్లో వివక్ష ఎందుకు అని చెప్పారు.

Update: 2021-04-22 05:29 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా వ్యాక్సిన్ ధరలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. వ్యాక్సిన్ ధరల్లో కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలు నిర్ణయించడం పట్ల అభ్యంతరం తెలిపిన కేటీఆర్.. రాష్ట్రాలపై మోదీ సర్కార్‌కు ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. వన్ నేషన్, వన్ ట్యాక్స్ కోసం అంగీకరించామని.. ఇప్పుడు వన్ నేషన్, వన్ వ్యాక్సిన్ల ధరల్లో వివక్ష ఎందుకు అని చెప్పారు. దేశవ్యాప్తంగా త్వరితగతిన వ్యాక్సినేషన్‌కు కేంద్రం ఎందుకు సహకరించదని ప్రశ్నించారు.పీఎం కేర్స్ నుంచి అదనపు ధరను కేంద్రం భరించాలని కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News