Minister KTR : బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసాన్ని ఖండించిన కేటీఆర్
Minister KTR : GHMC ఆఫీసులో మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు చేసిన విధ్వంసాన్ని ట్విట్టర్ వేదికగా ఖండించారు.;
Minister KTR : GHMC ఆఫీసులో మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు చేసిన విధ్వంసాన్ని ట్విట్టర్ వేదికగా ఖండించారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. గాడ్సే భక్తుల నుంచి గాంధీ మార్గం ఆశించడం టూ మచ్ అంటూ ట్వీట్ చేశారు. విధ్వంసానికి పాల్పడిని బీజేపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీజేపీ నిన్న చేసిన విధ్వంసానికి ఇవాళ కౌంటర్ ఇచ్చింది టీఆర్‌ఎస్. GHMC హెడ్ ఆఫీసులో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టింది. నల్ల రంగు పూసిన GHMC బోర్డుకు పాలాభిషేకం చేశారు టీఆర్ఎస్ కార్పొరేటర్లు. మేయర్ ఛాంబర్‌ను శుద్ధి చేశారు. విధ్వంసం సృష్టించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. మేయర్‌కు క్షమాపణ చెప్పకపోతే బీజేపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు.