పేపర్ వేస్తే తప్పేంటి.. బుడ్డోడి మాటలకు కేటీఆర్ ఫిదా
స్కూలుకి టైమవుతోందని అమ్మ అరిస్తే కాని లేవని చిన్నారి.. అమ్మకంటే ముందే లేచి పేపర్ వేయడానికి వెళుతున్న కొడుకుని చూసి;
స్కూలుకి టైమవుతోందని అమ్మ అరిస్తే కాని లేవని చిన్నారి.. అమ్మకంటే ముందే లేచి పేపర్ వేయడానికి వెళుతున్న కొడుకుని చూసి మురిసిపోయింది ఆ తల్లి.. ఆమెతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయ్యారు.
జగిత్యాలకు చెందిన జయప్రకాశ్ అనే విద్యార్థి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ రోజూ ఉదయం ఇంటింటికీ వెళ్లి పేపర్ వేస్తుంటాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి కుర్రాడి వద్దకు వెళ్లి చదువుకునే వయసులో పేపర్ ఎందుకు వేస్తున్నావు అని అడిగితే.. ఏం వేయకూడదా.. అంటే అలా అని కాదు.. చదువుకునే వయసులో పని చేస్తున్నావు కదా అని అడిగాడు.. దానికి ఆ పిల్లవాడు.. అందులో తప్పేముంది అంకుల్.. ఇప్పుడు కష్టపడటం వస్తే పెద్దయ్యాక ఈజీ అవుతుందని సమాధానం ఇచ్చేసరికి అడిగిన వ్యక్తి ఒక్కసారిగా షాకయ్యాడు.
పేపర్ వేస్తే తప్పేంటి.. చిన్నారి సమాధానానికి కేటీఆర్ ఫిదాఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో వీడియో చూసిన మంత్రి కేటీఆర్ కుర్రాడి సమాధానానికి ఫిదా అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆ వీడియోను పోస్ట్ చేస్తూ జయప్రకాశ్‌ను అభినందించారు. జగిత్యాల పట్టణం నుంచి వచ్చిన ఈ వీడియో చాలా నచ్చింది. ఆ విద్యార్థి ఆత్మవిశ్వాసం చూసి ముచ్చటేసింది. అతడి ఆలోచనా విధానంలో స్పష్టత చూసి చాలా సంతోషం అనిపించింది. చదువుకుంటూ పని చేయడంలో తప్పేంటని ప్రశ్నించిన విద్యార్థికి మంచి భవిష్యత్ ఉండాలి అని కేటీఆర్ ఆకాంక్షించారు.
Loved this video from Jagtial Town
— KTR (@KTRTRS) September 23, 2021
This young lad a Govt school student called Jai Prakash; loved his confidence, composure and clarity of thought & expression 👏👏
He says what's wrong in working while studying & goes on to say it'll keep him in good stead in future pic.twitter.com/Ug4wYIGn8a