Minister KTR : బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్
Minister KTR : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు తన న్యాయవాదితో బండి సంజయ్‌కు నోటీసులు పంపారు.;
Minister KTR : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు తన న్యాయవాదితో బండి సంజయ్‌కు నోటీసులు పంపారు. ఈ నెల 11న ట్విట్టర్‌లో కేటీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని, లేకపోతే.. బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. లేదంటే... పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఈ మేరకు ఇవాళ నోటీసులు పంపారు మంత్రి కేటీఆర్ న్యాయవాది. ప్రచారం కోసమే ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్‌కు ఆపాదించే దురుద్దేశ ప్రయత్నం చేశారన్నారు న్యాయవాది. మంత్రి కేటీఆర్ పరువుకు నష్టం కలగించేలా వ్యవహరించాలన్నారు. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం పరిహారం చెల్లించడంతో పాటు తగిన చర్యలకు అర్హులవుతారంటూ నోటీసులో పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్‌కు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలన్నారు.