Minister KTR : ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి రాని స్పష్టత.. ఈ నెల 26న మళ్లీ సమావేశం..!
Minister KTR : యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం భేటీలో ఎలాంటి స్పష్టత రాలేదు.;
KTR, Piyush Goyal (File Photo)
Minister KTR : యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం భేటీలో ఎలాంటి స్పష్టత రాలేదు. కేటీఆర్ బృందం దాదాపు గంటసేపు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించినా ఈ వ్యవహారంపై స్పష్టత రాలేదు. ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని కోరింది కేటీఆర్ బృందం. యాసంగి ధాన్యం గురించి కేంద్రమంత్రికి వివరించారు.
తెలంగాణ నుంచి కేంద్రం ఎంత మొత్తంలో ధాన్యం సేకరిస్తుంది? దీనిలో బాయిల్డ్ రైస్, ముడి ధాన్యం ఎంత తీసుకుంటారనే విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. రబీ, ఖరీఫ్‌కు సంబంధించిన విషయాల్లో ఎంత మొత్తంలో సేకరిస్తారనే విషయంలో క్లారీటీ ఇవ్వాలని కోరింది తెలంగాణ బృందం. కేంద్రం పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తే అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం... తదుపరి కార్యచరణ రూపొందిస్తుందని, రైతుల్ని అప్రమత్తం చేయాల్సి ఉంటుంది తెలిపింది.
అయితే... దీనిపై కేంద్రం నుంచి స్పష్టత రాకపోవడంతో.. ఈ నెల 26 మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైనవారిలో.... మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. పీయూష్ గోయల్‌తో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది కేటీఆర్ బృందం. ధాన్యం సేకరణ విషయంలో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.