ఎవరు ఏమి అన్నా అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతాం : మంత్రి కేటీఆర్
ఎవరు ఏమి అన్నా.. అభివృద్దే లక్ష్యంగా తెలంగాణప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు మంత్రికేటీఆర్. సిరిసిల్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించిన మంత్రి;
ఎవరు ఏమి అన్నా.. అభివృద్దే లక్ష్యంగా తెలంగాణప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు మంత్రికేటీఆర్. సిరిసిల్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించిన మంత్రి.. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేస్తున్న పథకాలను వెల్లడించారు. తెలంగాణా రాకముందు విద్యుత్ కోతలతో ... అర్ధరాత్రిళ్లు బావుల వద్దకు వెళ్లిన ఎంతోమంది రైతులు మృతిచెందారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయ పెట్టుబడికి ఎకరాకు సంవత్సరానికి పదివేలు ఇస్తున్న ఘనత టీఆర్ ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. సర్పంచ్‌ల సహాకారంతో సిరిసిల్లా, వేముల వాడపట్టణాలను జోడెద్దుల మాదిరి అభివృద్ది చేస్తామని హామి ఇచ్చారు.