KCR ప్రభుత్వం ఎన్నడూ రైతులకు అన్యాయం చేయదు: KTR
దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని రైతు సంక్షేమ పథకాల్ని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోందని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.;
దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని రైతు సంక్షేమ పథకాల్ని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోందని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించిన కేటీఆర్..గంభీరావుపేటలో రైతు వేదిక క్లస్టర్‌ను ప్రారంభించారు. రైతులంతా ఒకచోట కూర్చుని మాట్లాడుకునేందుకు వీలుగా రైతు వేదికలు నిర్మించినట్టు చెప్పారు.
తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఒకప్పుడు కరెంట్ లేక రైతులు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 24గంటల విద్యుత్ సరఫరా లేదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉచిత విద్యుత్ ఇస్తున్నారా..? ప్రతిపక్షాలు చెప్పాలని సవాలు విసిరారు.
అటు టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడేలా విద్యను అందిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో 2కోట్ల 25లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు.
గంభీరావుపేటలో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి కేజీ టూ పీజీ ఒకే ఆవరణలో ఉండేలా కృషి చేస్తామని అన్నారు. ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసే బాధ్యత తనది అని స్పష్టం చేశారు. విద్యార్థినుల కోసం హాస్టల్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు.