రాజీనామాపై మరోసారి సవాల్ విసిరిన మంత్రి మల్లారెడ్డి
తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు మంత్రి మల్లారెడ్డి. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.;
తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు మంత్రి మల్లారెడ్డి. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. తన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని, కాని.. రేవంత్‌రెడ్డి నుంచే ఏ సమాధానం రావడం లేదన్నారు మల్లారెడ్డి. రాజకీయాల్లో ఉన్నప్పుడు పద్దతిగా మాట్లాడాలని, జీవితంలో కష్టపడి పైకి వచ్చిన తనపై బురద చల్లడం సరికాదని అన్నారు.