రేవంత్ రెడ్డి ఎంపీగా మళ్లీ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : మల్లారెడ్డి సవాల్
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. రేవంత్ రెడ్డి, మంత్రి మల్లా రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి.;
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. రేవంత్ రెడ్డి, మంత్రి మల్లా రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. మల్లారెడ్డి స్టేజ్ మీద జోకర్, స్టేజ్ కింద బ్రోకర్ అంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. యూనివర్సిటీ పేరుతో భూ కబ్జాలకు పాల్పడ్డారని.. మల్లారెడ్డి మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలపై విచారణ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై మల్లారెడ్డి సీరియస్‌గా స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదన్న మల్లారెడ్డి.. ఇద్దరం రాజీనామా చేద్దాం.. రేవంత్ మళ్లీ ఎంపీగా గెలిస్తే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని సవాల్ చేశారు.