కమిటీ నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌ను ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 2020 ఆర్‌వోఆర్ చట్టంలో లోపాలు సరిచేసి 2024 ఆర్‌వోఆర్ చట్టం తెస్తున్నట్లు చెప్పారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందన్నారు మంత్రి పొంగులేటి. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉన్నాయనీ.. వాటిని తగ్గిస్తామన్నారు.