Khairatabad MLA Danam Nagender : నాకు మంత్రి పదవి హైకమాండ్ ఇష్టం

Update: 2025-07-08 07:30 GMT

తనకు మంత్రి పదవి ఇవ్వడం, ఇవ్వకపోవడం కాంగ్రెస్ హైకమాండ్ ఇష్టమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు మినిస్ట్రీ ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు చైర్మన్ ను నియమించిన కేంద్రం.. ఆఫీసు పెట్టలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేటీఆర్ స్వీకరించారని, సీఎంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని అన్నారు. ఎబ్బీ స్టేడియంలో జరిగిన గ్రామ స్థాయి సదస్సు ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసు కెళ్తానని, ముందుగా తన సెగ్మెంట్ లోనే ని ర్వహించాలని కోరుతానని దానం చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల మూడు పదవులను భర్తీ చేసిన అధిష్టానం, మిగిలిన వాటి భర్తీపై కసరత్తు చేస్తోంది. ఈసారి బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయా వర్గాల నేతలు కోరుతున్న నేపథ్యంలో, దానం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 

Tags:    

Similar News