Minister Seethakka : కొత్తగా 1,000 అంగన్వాడీ భవనాలు : మంత్రి సీతక్క

Update: 2025-07-26 09:30 GMT

సీఎం రేవంత్రెడ్డి ఆలోచనల కు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దే విధంగా పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. నవంబర్ 19 (ఇందిరా గాంధీ జయంతి) నాటికి 1,000 కొత్త అంగన్వాడీ భవనాల ప్రారంభానికి నిర్మాణాలు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష ఆమె నిన్న సమావేశం నిర్వహిం చారు. అంగన్వాడీ సేవలను మెరుగుపరచడం, పోషకాహార లోప నివారణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లానైపై చర్చించారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ జిల్లా అధికారులు అంగ న్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించి, హాజరు శాతాన్ని పెంచాలన్నారు. వర్షాకా లంలో భవనాల సమస్యలను తక్షణం పరిష్క రించి, పిల్లల భద్రత, శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం టీజీపీ ఎస్సీ ద్వారా ఎంపికైన 23 మంది సీడీపీఓలకు నియామక పత్రాలు అందజేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగాల్సిన అవసరం లేదు.. స్వేచ్ఛగా పనిచేయాలని సూచించారు. అంగన్వాడీ లబ్దిదారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే బాధ్యత సీడీపీవోలేదే అని అన్నారు. కా ర్యాలయాలకే పరిమితం కాకుండా ఫీల్డ్ విజిట్ చేయాలన్నారు.

Tags:    

Similar News