Minister Sridhar Babu : నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి : మంత్రి శ్రీధర్ బాబు
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారం భించిన ఫ్యూచర్ సిటీని నాలుగేళ్ల లోనే పూర్తి చేసి చూపిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. తమ పాలనలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు నాలుగేళ్లు చాల ని, పదేళ్ల కాలవ్యవధి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దావోస్లో లో తెలంగాణకు పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అక్కడకు వెళ్లారు. ఈ సంధర్భంగా లక్షా డెబ్భై వేల కోట్ల రూపాయల భారీ పెట్టు బడులు కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై సచివాలయంలో మంగళవారం శ్రీధర్ బాబు మీడియాతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలను వివరించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నూతన ఐటీ విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ మాల్స్ తీసుకువచ్చే ఆలోచనతో ఉన్నామని, రీజినల్ రింగు రోడ్డు చుట్టూ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్లు పాలన సాగించినా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకు రాలేదని చెప్పారు. తెలంగాణకు రెండు డ్రై పోర్టులు రానున్నాయని చెప్పారు.