సాగర్‌కు జానారెడ్డి ఏం చేశారని ఓట్లు వేయాలి? : మంత్రి తలసాని
నాగార్జునసాగర్ ఉప సమరం హోరాహోరీగా సాగుతోంది. ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది.;
నాగార్జునసాగర్ ఉప సమరం హోరాహోరీగా సాగుతోంది. ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. నోముల భగత్‌కుమార్ తరపున మంత్రులు తలసాని, మహమూద్ అలీ.. అనుముల మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. నాగార్జున సాగర్‌కు జానారెడ్డి ఏం చేశారని ఓట్లు వేయాలో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ హయాంలో సాగర్ అభివృద్ధి చెందిందని.. జానారెడ్డి సొంతూరికి కూడా ఏం చేయలేకపోయారని తలసాని ఎద్దేవా చేశారు.
సాగర్ ఉప ఎన్నికల్లో భగత్ గెలుపు నల్లేరు మీద నడకే అన్నారు ఎమ్మెల్యే కోరికంటి చందర్. దాదాపు మూడున్నర దశాబ్ధాలపాటు ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డి తన సొంత గ్రామానికి ఏం చేశారని ప్రశ్నించారు.ఇక కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తన కుమారుడిని గెలిపించాలని దివంగత నోముల నర్సింహయ్య భార్య లక్ష్మీ కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు.