బీజేపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు.. ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీనా? : మంత్రి తలసాని
బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.;
బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉందని.. సాధారణ మెజార్టీతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలిచామన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని బీజేపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని.. ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీనా? అని మంత్రి తలసాని ప్రశ్నించారు.