peddapalli : పెద్దపల్లి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య.. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో

peddapalli : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ మైనర్‌ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.;

Update: 2022-04-19 06:45 GMT

peddapalli : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ మైనర్‌ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.. సుల్తానాబాద్‌ మండలం కణుకుల గ్రామంలోఈ ఘటన చోటు చేసుకుంది.. కణుకుల గ్రామానికి చెందిన శివ, సుస్మిత ఇద్దరూ మైనర్లు.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే, విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో వ్యవహారం పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది.. ఇద్దరి కులాలు వేరుకావడం, మైనర్లు కావడంతో పెళ్లి చేయలేమని ఇరు కుటుంబాలు తేల్చి చెప్పాయి.. దీంతో మనస్తాపం చెందిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.

ప్రియుడు పురుగులమందు తాగి చికిత్స పొందుతూ కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు.. ప్రియుడి మరణవార్త విని తట్టుకోలేక సుస్మిత గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.. ప్రేమ జంట ఆత్మహత్యతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి..

Tags:    

Similar News