నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని మిస్ వరల్డ్-2025 పోటీదారులు సందర్శించనున్నారు. బుద్ధవనం ప్రాముఖ్యత తెలిసేలా పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆసియాలోని 30 దేశాలకు చెందిన ప్రపంచ సుందరి పోటీదారులు బుద్ధవనానికి రానున్నారు. వారికి 24 మంది లంబాడా కళాకారులు స్వాగతం పలకనున్నారు. జాతకవనం సందర్శన సందర్భంగా బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను అందగత్తెలు తిలకించనున్నారు. వెయ్యి మందితో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పర్యటన కొనసాగనుంది.