Hyderabad : మిస్ వరల్డ్ పోటీలు.. షెల్టర్ హోంలకు బెగ్గర్స్

Update: 2025-05-04 07:30 GMT

మిస్ వరల్డ్ పోటీలకు దాదాపు 120 దేశాల నుంచి అతిథులు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లలో భిక్షగాళ్లను షెల్డర్ హోంలకు తరలించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో 25 షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. నగరంలోని వివిధ సర్కిళ్లలో యా చించుకునే వారిని వాటిలోకి తరలించేందుకు సర్కారు రెడీ అవుతోంది. వీటితోపాటు ఎన్జీవోల ద్వారా నడుస్తున్న సెంటర్లలోనూ యాచకులను అకామిడేట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందాల పోటీల నేపథ్యంలో నగరానికి వచ్చే అతిథులకు యాచకులు కనిపించొద్దనే ఉద్దేశంలోనే షెల్టర్ హోంలకు తరలిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో కూడా యాచకులను షెల్టర్ హోమ్స్ కు తరలించారు. కేసీఆర్ హయాంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ నగరానికి వచ్చారు. అప్పుడు కూడా యాచకులను షెల్టర్ హోమ్స్ కు తరలించారు. ఇప్పుడు యాచకుల ను షెల్టర్ హోమ్స్ కు తరలించేందుకు ఏర్పా ట్లు చేస్తుండటం మిస్ వరల్డ్ పోటీల కోసమేననే వాదన బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News