ఈటల రాజేందర్ 70 ఎకరాలను కబ్జా చేశారు : బాల్క సుమన్
Balka suman : ఎస్సీ, ఎస్టీ, పేదల భూములు లాక్కోవడమే గాక దొంగేదొంగ అన్నట్లు ఈటల రాజేందర్ ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు;
Balka suman : ఎస్సీ, ఎస్టీ, పేదల భూములు లాక్కోవడమే గాక దొంగేదొంగ అన్నట్లు ఈటల రాజేందర్ ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు. నీతి, నిజాయితీ గురించి లెక్చర్లు చెప్పే ఈటల రాజేందర్ 70 ఎకరాల భూములను ఏ విదంగా కబ్జా చేశారని ప్రశ్నించారు. మెదక్ కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారని, ఇకనైనా తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. కబ్జాలకు పాల్పడిన ఈటలపై, జమున హేచరీస్‌పై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.