కాంగ్రెస్ సభ.. జన గర్జన కాదు .. భజన గర్జన : బాల్క సుమన్
ప్రచార సభలో టీఆర్‌ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి విమర్శలు గుప్పించగా.. దానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటర్ ఇచ్చారు.;
నాగార్జున సాగర్‌లో రాజకీయం వేడెక్కింది.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ప్రచార సభలో టీఆర్‌ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి విమర్శలు గుప్పించగా.. దానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటర్ ఇచ్చారు. బాల్క సుమన్ పేరును ప్రస్తావిస్తూ జానారెడ్డి విరుచుకుపడితే.. జానా నియోజకవర్గానికి చేసిందేంటని సుమన్ ప్రశ్నించారు. నిన్నటి కాంగ్రెస్ సభ జన గర్జన కాదని.. భజన గర్జన అని విమర్శించారు.