డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూతురు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఈటెల
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కుమార్తె వివాహ వేడుకలకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరుకావటం ప్రాధాన్యత సంతరించుకుంది.
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కుమార్తె వివాహ వేడుకలకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరుకావటం ప్రాధాన్యత సంతరించుకుంది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు చిన్న కుమార్తె మౌనిక వివాహమహోత్సవానికి... ఈటల రాజేందర్ హాజరయ్యారు. వేడుకలో పాల్గొన్న ఈటల వధువరులనూ ఆశీర్వదించారు. ఇక ఈ వివాహ వేడుకకి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటుగా మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో ఈ వివాహమహోత్సం జరిగింది.