MLA Kaushik Reddy : కౌశిక్ రెడ్డి విచారణ జనవరి 6కు వాయిదా

Update: 2024-12-28 18:07 GMT

హుజూరాబాద్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. బంజారా‌హిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించారనే కేసులో విచారణ జనవరి 6కు వాయిదా పడింది. కాగా, ఈ కేసుకు సబంధించి శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణ రావాలంటూ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే, తన తండ్రి హార్ట్ సర్జరీ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని పోలీసులకు తెలిపారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు జనవరి 6కు విచారణను వాయిదా వేశారు. అదేవిధంగా ఈ కేసులో కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో సహా మరో 20 మంది అనుచరులను పోలీసులు నిందితులుగా చేర్చారు

Tags:    

Similar News