MLC Elections: ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీలో 3, తెలంగాణలో 6..
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది.;
MLC Elections (tv5news.in)
MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్లీ నుంచి 16వ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఈనెల 29న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ఇటు ఏపీ, అటు తెలంగాణలో అధికార పార్టీకే అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉండడంతో ఎమ్మెల్సీ పదవులన్నీ ఆయా పార్టీల ఖాతాలో చేరనున్నాయి.