MLC Kavitha : సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

Update: 2024-12-10 10:15 GMT

తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తే తరిమికొడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. రేవంత్ సర్కార్ తెలంగాణ ఆస్థిత్వాన్ని మరుగున పరిచేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం దుర్మార్గమన్నారు. తెలంగాణ పోరాట యోధులు విమలక్క, బెల్లి లలితక్క గుర్తుకు లేరా అని సీఎంను ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి నిరసనగా తెలంగాణ భవన్ లో మహిళా నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత నిరసన తెలిపారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కవిత.. ప్రభుత్వంపై ఫైరయ్యారు.

Tags:    

Similar News