Kavitha : ఎమ్మెల్సీ కవితకు సోమవారం బెయిల్..!

Update: 2024-08-10 08:00 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవితకు సోమవారమే బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో సోమవారం విచారణకు రానుంది. వారం రోజుల పాటు ఢిల్లీలో హై లెవల్ సీక్రెట్ చర్చలు జరిపి వచ్చిన కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్‌లో మెడికల్ గ్రౌండ్స్ పై కవితకు బెయిల్ వస్తుందన్న సంకేతాలు ఇచ్చారు.

వచ్చే వారం కవితకు బెయిల్ వస్తుందని.. ప్రాసెస్ లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం.. సాయంత్రానికి కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో లిస్టు అయినట్లుగా బయటకు వచ్చింది.. కవిత పదకొండు కేజీల బరువు తగ్గారని .. హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్న కారణంగా మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ కోరితే.. కోర్టు సంతృప్తి పడితే.. మరో కేసులో అంటే ఈడీ కేసుల్లో కూడా బెయిల్ వచ్చినట్లే.. అందుకే ఈ కోణంలో ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు.

Tags:    

Similar News