సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ జనసమితి బృందం భేటీ అయింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారి నేతృత్వంలో టీజేఎస్ నేతలు సీఎంను కలిసి ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతులకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని.. ప్రధానంగా విద్యార్ధి, నిరుద్యోగ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. వీటిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ జనసమితి సూచనలను స్వీకరించడానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. అందరం కలిసి తెలంగాణను మరింత ఉన్నతంగా తీర్చుదిద్దుదామని సూచించారు.