ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.;
మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రులు తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని పిలుపిచ్చారు. ఓ మహానుభావుడు చెప్పినట్టు.. ముందుగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి.. విద్యావంతులకు ఓటు వేసేందుకు బయల్దేరానని చెప్పారు. విద్యావంతులంతా ఓటు వేయాలని, ఓటింగ్ శాతం పెంచి బాధ్యత చూపాలని అన్నారు.