TS Elections: 2023 ఎన్నికలు నేపథ్యంలో భారీగా నగదు పట్టివేత
నిఘా పెరిగి... నగదు దొరికింది;
2023 తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదును అధికారులు పట్టుకున్నారు. రికార్డ్ స్థాయిలో రూ. 756 కోట్లను ఎన్నికల కమిషన్ సీజ్ చేసింది. ఎన్నికల కోడ్‌లో ఐటీ, ఈడీ, పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి పెద్ద ఎత్తున నగదు, నగలు, మద్యం పట్టుబడుతున్నాయి. పోలీసులు కోడ్ వచ్చిన నాటి నుంచి అడుగడుగునా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున నగదు, నగలు, మద్యం పట్టుబడుతూనే ఉన్నాయి. వీటికి తగిన పత్రాలు చూపించిన వారివి మాత్రమే వదిలేస్తున్నారు పోలీసులు. ఎలాంటి పత్రాలు లేనివి సీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఉల్లంఘన కింద భారీ ఎత్తున నగదు సీజ్ చేస్తున్నారు పోలీసులు.
ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో నగరంలో ఇంత నగదు పట్టుబడలేదు. 2014 ఎన్నికల్లో నగరంలో కేవలం రూ.12,11,250 నగదు నగరంలో పట్టుబడగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.27,03,76,991 నగదు పట్టుబడింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులు భారీ ఎత్తున నగదును పట్టుకున్నారు. నగరంలో చెక్‌పోస్టులు, తనిఖీలు ముమ్మరం చేయడంతో ఎన్నికల్లో అక్రమాలకు తెరపడింది.
ఎక్కడికక్కడ తనిఖీలను చేయడంతో భారీ స్థాయిలో నగదు పట్టుబడింది. వాహనాల తనిఖీ చేస్తుండగా హవాలా డబ్బులు తీసుకుని వస్తుండగా బేగంబజార్, ఎస్‌ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పోలీసులు భారీ ఎత్తున నగదును పట్టుకున్నారు. కమీషన్ తీసుకుని ఓ వ్యాపారి వద్ద నుంచి కోటి రూపాయలు తీసుకుని బైక్‌పై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కమీషన్ తీసుకుని హవాలా వ్యాపారుల నగదును తరలిస్తున్నారు. హవాలా వ్యాపారులు వివిధ రాష్ట్రల నుంచి డబ్బును తెప్పిచ్చి కమీషన్ తీసుకుని రాజకీయ నాయకులకు చేరవేశారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన 226 మంది అభ్యర్థులపై క్రమినల్ కేసులు నమోదయ్యాయి. 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన 360 మంది అభ్యర్థులు పోటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 84 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 78 మంది క్రిమినల్ కేసులు కలిగిన అభ్యర్థులతో బీజేపీ రెండో స్థానంలో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 58 మందిపై కేసులు నమోదయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ 119 మంది అభ్యర్థుల్లో దాదాపు 56 మంది ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసు ఉన్నట్టు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. 2018 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2023 నాటి ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. వ్యక్తిగతంగా ఎక్కువ కేసులు ఉన్న నేతల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.